అఘోరగా విశ్వక్ సేన్.. ఆకట్టుకున్న ‘గామి’ గ్లింప్స్ !

Published on Oct 18, 2021 12:18 pm IST

హీరో విశ్వక్ సేన్ మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విశ్వక్ సేన్ ‘గామి’ అంటూ మరో ప్రయోగం చేస్తున్నారు. సరికొత్త జోనర్ లో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ పేరుతో టీజర్ విడుదల అయింది. అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్.. అత్యున్నతమైన విజువల్స్ తో టీజర్ ఆకట్టుకుంటుంది.

ఇందులో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నారు. టీజర్ లో విశ్వక్ కనిపించకపోయినా 2-3 షాట్స్ లో ఆ ఫీల్ కనిపించింది. విద్యాధర్ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More