పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా ‘గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ కి చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్ళడం లేదు. దాంతో కొద్ది రోజులుగా మీడియాలో ‘గబ్బర్ సింగ్ 2’ ఆగిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు.
మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘గబ్బర్ సింగ్ 2’ ఆగిపోయింది అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఈ సినిమా ఆలస్యమవుతోంది. గబ్బర్ సింగ్ 2 సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల షూటింగ్ పూర్తి చేసాక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ పుకార్లపై త్వరలో అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు.


