“వకీల్ సాబ్”కి “గబ్బర్ సింగ్” మ్యాజిక్ రిపీట్ అవుతుందా.?

Published on Mar 20, 2021 3:09 pm IST

మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్ల పాటు సరైన హిట్ లేకపోయినా సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టగలిగే స్టామినా పవర్ స్టార్ సొంతం. అయితే అలా ఫ్లాప్స్ తో కెరీర్ డౌన్ అవుతుంది అన్న టైం లోనే ఎగసే కెరటంలా సాలిడ్ హిట్స్ ను జల్సా మరియు గబ్బర్ సింగ్ సినిమాలతో పవన్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ తన కం బ్యాక్ సినిమా “వకీల్ సాబ్” తో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా అనిపిస్తుంది.

పవన్ మరియు హరీష్ శంకర్ ల కాంబోలో వచ్చిన “గబ్బర్ సింగ్” ను పవన్ ఫ్యాన్స్ ఎవరూ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. అయితే అది రీమేక్ అయ్యినప్పటికీ హరీష్ ఎలా అయితే దబాంగ్ షేపులు మార్చేసారో ఇప్పుడు పింక్ కు వేణు శ్రీరామ్ కూడా అలాగే మార్చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మెయిన్ కోర్ లైన్ ను అలాగే ఉంచి పవన్ స్టార్డం ను అలాగే తన స్వాగ్ అండ్ యాటిట్యూడ్ ను మ్యాచ్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వకీల్ సాబ్ లో అనిపిస్తుంది.

మరి అలాగే గబ్బర్ సింగ్ సింగ్ టైం లో కూడా నిజానికి ఇప్పుడు వకీల్ సాబ్ కు ఉన్నంత హైప్ లోనే ఉంది. పైగా జల్సా టైం నుంచి హిట్ లేదు దీనితో ఆ సినిమాకు డౌన్ తోనే మొదలయ్యి భారీ హిట్ గా అయ్యి మళ్ళీ పవన్ స్టార్డం ను నిలబెట్టేలా చేసింది. ఇప్పుడు వకీల్ సాబ్ కు కూడా అలానే ఉంది. దీనికి ముందు ఎక్కువ గ్యాప్ తో పాటుగా సరైన హిట్ పవన్ కొట్టింది లేదు. హైప్ కూడా అంతంత మాత్రమే ఉంది.

కానీ వేణు శ్రీరామ్ కూడా గట్టి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సో ఈ రకంగా చూస్తే తప్పకుండ గబ్బర్ సింగ్ టైం మ్యాజిక్ రిపీట్ అయ్యినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. కాకపోతే అప్పటికి కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో కానీ మంచి టాక్ వస్తే మళ్ళీ కళ్యాణ్ మాస్ హిస్టీరియా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ ఇచ్చిన సంగీతం కూడా మంచి హైప్ తెస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా శృతి హాసనే హీరోయిన్. నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :