ఓటిటిలో “గదర్ 2” తెలుగు వెర్షన్..ఎందులో అంటే

ఓటిటిలో “గదర్ 2” తెలుగు వెర్షన్..ఎందులో అంటే

Published on Nov 30, 2023 12:25 PM IST

ఈ ఏడాది బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు భారీ హిట్ చిత్రాల్లో సన్నీ డియోల్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ శర్మ తెరకెక్కించిన చిత్రం “గదర్ 2” కూడా ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలు అనంతరం సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్యమైన విజయాన్ని బాలీవుడ్ మార్కెట్ లో సొంతం చేసుకుంది ఆల్ టైం రికార్డు గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

అయితే ఈ చిత్రం సక్సెస్ తో తెలుగు ఆడియెన్స్ కి కూడా చాలామందికి అసలు ఈ సినిమా ఏంటా తెలుగులో కూడా ఉందా లేదా అని చూసినవారు లేకపోలేరు. అయితే ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత కూడా జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో కూడా హిందీలోనే వచ్చింది.

కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ అయితే మరో స్ట్రీమింగ్ యాప్ లో వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిని ప్రముఖ ఆన్లైన్ బుకింగ్స్ యాప్ బుక్ మై షో లో రేపు డిసెంబర్ 1 నుంచి రాబోతుంది. అయితే ఇందులో ఈ వెర్షన్ 199 రూపాయలు చెల్లించి చూడాల్సి ఉంటుంది. మరి రెంటల్ గా వస్తున్నా ఈ చిత్రం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు