విడుదలైన గాలిపటం ప్రమోషనల్ వీడియో

విడుదలైన గాలిపటం ప్రమోషనల్ వీడియో

Published on Jun 28, 2014 7:55 PM IST

galipatam-pramotional-song
ప్రమోషనల్ వీడియోలు విడుదలచేసి సినిమాలకు ప్రచారం తీసుకురావడం ఇప్పటి టాలీవుడ్ కొత్తట్రెండ్. ఈ ధోరణిలోనే ఈరోజు ‘గాలిపటం’ చిత్రబృందం ఒక కొత్త వీడియోని విడుదలచేశారు. ఈ వీడియోలో మొత్తం సినిమా బృందమంతా కనిపిస్తారు. ఈ చిత్ర హీరో ఆది గాలిపటం మార్క్ స్టెప్ తో అలరిస్తాడు

ఎరికా ఫెర్నాండెజ్ మరియు క్రిష్టియానా అఖీవా హీరోయిన్స్. అందాల రాక్షసి ఫేం రాహుల్ ప్రత్యేకపాత్రధారి. రచ్చ సినిమాతో విజయం సాధించిన సంపత్ నంది ఈ సినిమాతో నిర్మాతగా మారనున్నాడు. నవీన్ గాంధి దర్శకుడు

భీమ్స్ సంగీతదర్శకుడు. భాస్కర్ భట్ల సాహిత్యాన్ని అందించారు. ప్యాచ్ వర్క్ ముగియగానే ఆడియో మరియు సినిమా విడుదలతేదీలు ప్రకటిస్తారు

ప్రమోషనల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు