డిసెంబర్ 10న థియేటర్లలో గమనం !

Published on Nov 21, 2021 6:38 pm IST

ప్రముఖ నటి శ్రియ ప్రాధాన పాత్రలో నటిస్తున్న సినిమా ’గమనం.‘ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా ’గమనం‘ రానుంది. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘గమనం’ సినిమా డిసెంబర్ 10న కేవలం థియేటర్లలోనే రిలీజ్ కాబోతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక శ్రియ, నిత్యా మీనన్ తో పాటు ఇంకా ఈ సినిమాలో ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివ కందుకూరి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సుజనా రావు దర్శకత్వం వహిస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా చేస్తూనే , ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్ క్లాసికల్ సింగర్ శైలపుత్రీ దేవి పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :