“గేమ్ ఛేంజర్” ఫస్ట్ లుక్ వారిద్దరి రేంజ్ ని మ్యాచ్ చేయలేదా.?

Published on Mar 28, 2023 7:03 am IST

సెన్సేషనల్ సక్సెస్ “రౌద్రం రణం రుధిరం” తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మరో క్రేజీ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేసిన చిత్రమే “గేమ్ ఛేంజర్”. నిన్న రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మొదట సినిమా టైటిల్ ని అలాగే నెక్స్ట్ ఫస్ట్ లుక్ ని అయితే రిలీజ్ చేశారు. మరి మొదట టైటిల్ టీజర్ అయితే బాగానే ఆకట్టుకుంది కానీ ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం కాస్త మిక్సిడ్ రెస్పాన్స్ నే అందుకుంది అని చెప్పాలి.

జనరల్ గా శంకర్ సినిమాలు అంటే ప్రతి చిన్న విషయం కూడా ఎంతో యూనిక్ గా చాలా కేజ్రీగా ఉంటుంది. అయితే ఈసారి చరణ్ పోస్టర్ కూడా కాస్త డిఫరెంట్ గానే ట్రై చేశారు కానీ కాస్త సింపుల్ గానే ఉందని టాక్. ఇప్పుడు చరణ్ రేంజ్ వేరు అలాగే శంకర్ రేంజ్ ఎప్పటి నుంచో వేరు అందుకే మరికాస్త ఇంట్రెస్టింగ్ లుక్ ని అయితే ఫ్యాన్స్ సహా అంతా ఆశించారు. మరి నెక్స్ట్ వచ్చేవి అయినా కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా ఉంటాయో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :