భారీ స్థాయిలో విడుదలకానున్న ‘గేమ్ ఓవర్’ !

Published on Jun 5, 2019 3:53 pm IST

2017లో వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత తాప్సీ దక్షిణాదిన సినిమాలు తగ్గించేసి పూర్తిగా హిందీ పరిశ్రమకే పరిమితమయ్యారు. అక్కడే వరుస సినిమాలు చేసి మంచి విజయాల్ని అందుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె దక్షిణాదిన ద్విభాషా చిత్రాన్ని చేశారు. అదే ‘గేమ్ ఓవర్’. వీడియో గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేశాడు.

ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది. అక్కడ తాప్సీకి మంచి మార్కెట్ ఉండటంతో పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. మూడు భాషల్లో కలిపి సుమారు 1200 స్క్రీన్లలో చిత్రం జూన్ 14న విడుదలవుతుంది. వై నాట్ స్టూడియోస్ సంస్థపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత తాను చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని తాప్సీ నమ్మకంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More