‘రిపబ్లిక్’ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి – కొరటాల శివ

‘రిపబ్లిక్’ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి – కొరటాల శివ

Published on Jul 11, 2021 1:47 AM IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు దేవ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ “రిపబ్లిక్”. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పాతాకంపై ఈ చిత్రాన్ని నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ‘గానా ఆఫ్‌ రిపబ్లిక్‌’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ‘రిపబ్లిక్‌’ సినిమాలో కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ విడుదల చేశారు.

ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ ‘రిపబ్లిక్‌’ సినిమాలోని సాంగ్‌ను రిలీజ్‌ చేయడం పట్ల చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నానని, స్వేచ్చ గురించి చెప్పే ఈ సాంగ్‌ చాలా బావుందని అన్నారు. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. చెబుతూ ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.

దర్శకుడు దేవ్‌ కట్టా మాట్లాడుతూ మణిశర్మ గారితో చాలా రోజుల నుంచి ట్రావెల్‌ అవుదామని అనుకున్నానని ‘రిపబ్లిక్‌’ సినిమా ద్వారా అది కుదరడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. కొరటాల శివగారు మా సాంగ్‌ను రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రైటర్‌ బి.వి.ఎస్‌.రవిగారికి చాలా థాంక్స్‌ అంటూ, జీ స్టూడియోస్‌ వారు ఎంతో సపోర్ట్‌ చేస్తూ వచ్చారని అందుకే నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చక్కగా ప్రెజెంట్‌ చేయగలుగుతున్నానని అన్నారు. ఇక లిరిక్‌ రైటర్‌ రెహమాన్‌ మంచి సాహిత్యాన్ని అందించాడు. అలాగే సాయితేజ్‌కి, నిర్మాతలకు స్పెషల్‌ థాంక్స్‌ చెప్పుకొచ్చాడు.

నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావు మాట్లాడుతూ “మా సినిమా ఫస్ట్‌ సాంగ్‌ కొరటాల శివగారి చేతుల మీదుగా స్టార్ట్‌ కావడమే పెద్ద సక్సెస్‌గా మేం భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ మాట్లాడుతూ “సాయితేజ్‌తో తొలిసారి కలిసి పనిచేస్తున్నానని, అలాగే నిర్మాతలు భగవాన్‌, పుల్లారావుగారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దేవ్‌ కట్టాగారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

రైటర్‌ బి.వి.ఎస్‌.రవి మాట్లాడుతూ ‘రిపబ్లిక్‌’ అనే టైటిల్‌లోనే చాలా సామాజిక బాధ్యత కనిపిస్తుందని, ఈ సినిమాను దేవ్‌కట్టాగారు తన స్టైల్లో తెరకెక్కించారని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇక ఎలాంటి క్యారెక్టర్‌ను అయినా చేయగల నటుడు సాయి తేజ్ అని, ఈ సినిమాలో కూడా చాలా మంచి పాత్రలో కనిపిస్తాడని అన్నారు. మణిశర్మగారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, ఈ సాంగ్‌ను కూడా ఎంతో చక్కగా అందించారని అన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పుకొచ్చారు.

హీరో సాయిధరమ్ తేజ్‌ మాట్లాడుతూ “గానా ఆఫ్‌ రిపబ్లిక్‌’ సాంగ్‌ను పెద్ద స్క్రీన్‌పై చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని, ఖచ్చితంగా మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని అన్నారు. దేవ్‌ కట్టాగారు నాకు ఒక మంచి సినిమాను ఇచ్చారని, మా నిర్మాతలు భగవాన్‌గారు, పుల్లారావుగారు, జీస్టూడియోస్‌వారు కలిసి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మణిశర్మగారితో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇకపై ఆయనతో చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నానని తెలిపాడు. స్పెషల్ గెస్ట్‌గా వచ్చి పాటను రిలీజ్ చేసిన కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు