చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సైన్ చేసిన ట్యాలెంటెడ్ యాక్టర్ !

Published on Apr 2, 2019 12:30 pm IST

హిందీ తో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేశాడు మోడల్ కమ్ యాక్టర్ గణేష్ వెంకట్రామన్. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ 1 షో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ నటుడు తెలుగులో డమరుఖం , సంథింగ్ సంథింగ్ చిత్రాల్లో నటించాడు.

ఇక మళ్ళీ చాలా రోజుల తరువాత గణేష్ తెలుగు సినిమాకి సైన్ చేశారు. అయితే ఈ సారి కూడా ఆయన , డమరుఖం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లోనే నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గణేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :