గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో జాయిన్ కానున్న చెన్నై బ్యూటీ !

Published on Apr 24, 2019 7:00 pm IST

నాని- విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో వుంది. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్ , ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈషెడ్యూల్ లో పాల్గొననుంది మేఘా.

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక మేఘా ఆకాష్ తెలుగులో నితిన్ తో లై , చల్ మెహన్ రంగ చిత్రాలు చేయగా రెండు పరాజయాన్నే చవిచూశాయి. మరి ఈ చిత్రం తోనైనా తెలుగులో మొదటి హిట్ కొడుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :