యంగ్ హీరోలిద్దరూ యుద్దానికి సిద్దమయ్యారు.

Published on Aug 16, 2019 9:55 am IST

టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో గ్యాంగ్ లీడర్, వాల్మీకి చిత్రాలు ఉంటాయి అనడంలో సందేశం లేదు. దానికి కారణం ఈ రెండు చిత్రాలు విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు. ఈ చిత్రాల టీజర్స్ తోనే ఆ విషయం అర్థమైపోయింది. విలక్షణ దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె కుమార్ నాని ని రివేంజ్ స్టోరీ రైటర్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ అనే సీరియస్ టైటిల్ పెట్టి, ఐదుగురు ఆడవాళ్ళ టీంతో నాని చేత కామెడీ పండించనున్నారని సమాచారం.

ఇక వాల్మీకి చిత్రానికి వస్తే వరుణ్ తన రూపంతోనే భయపెట్టేలా ఉన్నారు.సినిమా హీరోగా మారె గ్యాంగ్ స్టర్ గా ఆయన కనిపించనున్నారు. ఒకవైపు ఆవేశం,మరోవైపు హాస్యం పండించే రౌడీ పాత్రలో వరుణ్ అలరించనున్నారు. తమిళ జిగర్తాండా చిత్రానికి తెలుగు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతుంది. నిన్న విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది.

కాగా ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 13నే విడుదల కానున్నాయి. గ్యాంగ్ లీడర్ టీం ఒక వారం క్రితం విడుదల తేదీ ప్రకటించగా, నిన్న విడుదలైన వాల్మీకి టీజర్ లో వరుణ్ మూవీ విడుదల తేదీని రివీల్ చేయడం జరిగింది. దీనితో సెప్టెంబర్ 13న బాక్సాపీస్ పోరు రసవత్తరంగా మారింది. వాల్మీకి మూవీ అక్కడక్కడా హాస్యంతో సీరియస్ గా సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ కాగా,గ్యాంగ్ లీడర్ కామెడీ తో సాగే ఎమోషనల్ రివేంజ్ డ్రామా. రెండు విభిన్న జానర్లకి చెందినప్పటికీ పోరు మాత్రం రసవత్తరం.

సంబంధిత సమాచారం :