సమీక్ష: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ – ఆకట్టుకోలేకపోయిన యాక్షన్ డ్రామా

సమీక్ష: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ – ఆకట్టుకోలేకపోయిన యాక్షన్ డ్రామా

Published on Jun 1, 2024 3:03 AM IST
Gangs of Godavari Movie Review in Telugu

విడుదల తేదీ : మే 31, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు

దర్శకుడు: కృష్ణ చైతన్య

నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి

ఎడిటింగ్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి అంచనాల నడుమ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

 

కథ:

కొవ్వూరు గ్రామంలో లంకల రత్నం(విశ్వక్ సేన్) జీవితంలో ఎదగాలని ఎమ్మెల్యే దొరసామి రాజు(గోపరాజు రమణ) బృందంలో చేరుతాడు. ఆ తరువాత అతడు నానాజీ(నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా అతడికి శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన రత్నాకర్ ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జి(నేహా శెట్టి) ఎవరు.. రత్నాకర్‌కు ఆమెతో ఎలాంటి సంబంధం ఉంటుంది..? ప్రత్యర్థుల ఎత్తుగడలను రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

లంకల రత్నాకర్‌గా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అతడు గోదావరి యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అధికారం రాకముందు, వచ్చిన తరువాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ చాలా బాగా చూపెట్టాడు. అంజలి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, యువన్ శంకర్ రాజా అందించిన స్కోర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆదిలు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో సాగగా, సెకండాఫ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఫస్ట్ హాఫ్‌లోని ఆసక్తిని సెకండ్ హాఫ్‌లో కొనసాగించలేకపోయారు. కృష్ణ చైతన్య డైరెక్షన్ బాగున్నా, స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నేహా శెట్టి పాత్ర ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. అంజలి పాత్ర నిడివి కూడా ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. ఎమ్మెల్యే పాత్రలో గోపరాజు రమణ కాకుండా వేరొక నటుడైతే ఆ ఇంపాక్ట్ బలంగా ఉండేది. నాజర్, సాయి కుమార్‌ల ట్యాలెంట్ వృధా అయ్యింది. కొన్ని సీన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ వాటిని ప్రెజెంట్ చేసిన తీరు వాటిపై ఆసక్తిని తగ్గిస్తాయి. దర్శకుడు ఎమోషనల్ సీక్వెన్స్‌లపై మరికాస్త ఫోకస్ చేయాల్సింది.

 

సాంకేతిక వర్గం:

కృష్ణ చైతన్య డైరెక్షన్ ఓవరాల్‌గా బాగున్నా, సెకండాఫ్‌పై ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా కథ మరింత ఆసక్తికరంగా ఉండేది. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. అనిత్ మధడి సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఫస్ట్ హాఫ్‌లో అదిరిపోయినా, సెకండాఫ్‌లో బెటర్‌గా ఉండాల్సింది. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు:

మొత్తంగా చూస్తే, గ్యాంగ్స్ ఆప్ గోదావరి ఒక రొటీన్ మాస్ యాక్షన్ మూవీగా నిలుస్తుంది. విశ్వక్ సేన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే అంజలి నటన ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. అయితే, సెకండాఫ్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, అనవసరమైన సన్నివేశాలు, కథ స్లోగా సాగడం ప్రేక్షకులకు నిరాశను మిగిలిస్తాయి. ఈ వీకెండ్‌లో చక్కటి వినోదాత్మకమైన సినిమా చూడాలనుకునేవారు ఈ మూవీని స్కిప్ చేయవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు