అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వృషకర్మ’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను నేడు(నవంబర్ 25) రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించడంతో ఈ ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తూ ఉన్నారు.
కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ‘వృషకర్మ’ సినిమా ట్రైలర్ విడుదలను చిత్రబృందం వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన సమయానికి కాకుండా, ఈ ట్రైలర్‌ను రేపు (నవంబర్ 26న) ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ నిరీక్షణకు తగిన ప్రతిఫలం కచ్చితంగా ఉంటుందని, రేపు ట్రైలర్ విడుదలయ్యాక ఆ హంగామా మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాత్సవ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


