గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్, టీజర్ విడుదల తేదీ ఖరారు !
Published on Oct 4, 2016 9:53 am IST

Gautamiputra-Satakarni
నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ మరియు టీజర్ లు వచ్చేస్తున్నాయి. బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి లుక్ ను ఈనెల 9 న విడుదల చేయనున్నారు.

అంతేకాదు బాలయ్య మరో దసరా కానుకని కూడా అందించనున్నాడు.ఈనెల 11 న ఉదయం 8 గంటలకు ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను విడుదలచేయనున్నారు.బాలకృష్ణే టీజర్, ఫస్ట్ లుక్ ల విడుదల తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.చారిత్రాత్మక నేపథ్యం లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తుండగా రాజీవ్ రెడ్డి నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.శ్రీయ, హేమమాలిని ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook