వైరల్ : మహేష్ కుమారుడు గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో

వైరల్ : మహేష్ కుమారుడు గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో

Published on Dec 1, 2022 7:33 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ల కుమారుడు గౌతమ్ కృష్ణ ప్రస్తుతం లండన్ లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. మొదటి నుండి కూడా మహేష్ కూతరు సితార, అలానే కుమారుడు గౌతమ్ ఇద్దరూ కూడా పలు విషయాల్లో చురుకుగా పాల్గొంటుంటారు. ఇక వీరిద్దరికీ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఉండడంతో ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీ విషయాలను వాటి ద్వారా షేర్ చేస్తుంటారు గౌతమ్, సితార. అయితే విషయం ఏమిటంటే, లండన్ లో తన స్నేహితులతో కలిసి గౌతమ్ చేసిన ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియోని కొద్దిసేపటి క్రితం నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు.

నిజానికి తండ్రి మహేష్ నటించిన వన్ నేనొక్కడినేలో ఆయన చిన్నప్పటి పాత్రలో గౌతమ్ కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ‘తను ప్రేమ నిపుణుడు కాదు, కానీ తనకి స్నేహితులు ఉన్నారు. హైస్కూల్‌లో గౌతమ్‌ ఘట్టమనేని మొదటి థియేటర్ ప్రొడక్షన్ లో తన స్టైల్‌లో ఎంతో బాగా నటించాడు. తనకు ఫ్రోజెన్ ఫ్యామిలీ (అమెరికన్‌ ఫాంటసీ ఫిలిమ్స్‌) ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అంటూ అమెరికన్‌ ప్లే వీడియోని షేర్ చేస్తూ పోస్ట్ చేసారు నమ్రత శిరోద్కర్. ఇక ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

https://www.instagram.com/p/Clnak3Fj-o1/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు