ధనుష్ సినిమాకు ఇదే మంచి తరుణం

Published on Nov 5, 2019 1:00 am IST

దర్శకుల్లో గౌతమ్ మీనన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ కొన్నేళ్ళుగా ఆయన కెరీర్ ఒడిదుకుల్లో ఉంది. నిర్మాతగా పలు సమస్యలు ఆయన్ను వెంటాడుతుంటే దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు అనుకున్న సమయంలో విడుదలకి నోచుకోవడం లేదు.

అలాంటి సినిమాల్లో ధనుష్ హీరోగా చేసిన ‘ఎన్నై నొక్కి పాయుమ్ తోట’ ఒకటి. ఏడాదిన్నర క్రితమే షూటింగ్ ముగిసినా ఫైనాన్షియల్ సమస్యల కారణంగా అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా ధనుష్ చేసిన ‘అసురన్’ గ్రాండ్ హిట్ అయింది. ఈ తరుణంలో తన సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని గౌతమ్ మీనన్ భావిస్తున్నారట.

అందుకోసం నిర్మాతలతో చర్చలు జరిపి నవంబర్ నెలాఖరున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ ఫ్యాన్స్ సైతం ఇదే మంచి సమయమని, ఇకనైనా వాయిదాలు వేయకుండా విడుదల చేసేస్తే మంచిదని అంటున్నారు. మరి ఈ అవకాశాన్ని గౌతమ్ మీనన్ సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :