మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. గత నెలలో కృష్ణవంశీ బర్త్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయ్యాలనుకున్నారు. కానీ అప్పుడు పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా గోవిందు అందరివాడేలే ఫస్ట్ టీజర్ ని ఆగస్ట్ 7వ తేదీ సాయంత్రం విడుదల చేయనున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.
ఇటీవలే పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన ఈ మూవీ కొత్త షెడ్యూల్ నిన్నటి నుంచి హైదరాబాద్లో మొదలైంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ, కమలిని ముఖర్జీ, ఆదర్శ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.


