రేపటి నుంచి గోవిందుడికి రీ రికార్డింగ్

Published on Aug 25, 2014 11:00 am IST

govindudu-andarivadele
బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ హీరోగా చేస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అక్కడ చరణ్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ మరియు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్ర టీం అక్కడి నుంచి తిరిగి రాగానే హైదరాబాద్ నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో మరో పాటని షూట్ చేయనున్నారు.

బండ్ల గణేష్ ఈ సినిమాని అక్టోబర్ 1న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. దానికోసం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఫస్ట్ హాఫ్ కి సంబందించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు రేపు(ఆగష్టు 26) ఉదయం 9 గంటలకు చెన్నై లోని యువన్ శంకర్ రాజ ఆఫీసులో మొదలు కానున్నాయి. అలాగే రామ్ చరణ్ కూడా లండన్ నుంచి రాగానే తన పార్ట్ కి డబ్బింగ్ మొదలు పెట్టనున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ తన కెరీర్లో మొదటిసారిగా చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి కృష్ణవంశీ డైరెక్టర్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :