బిగ్ బాస్3 లో ‘ఫిదా’ బ్యూటీ…?

Published on Jun 29, 2019 11:00 pm IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్3 రియాలిటీ షో అతిత్వరలో ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో 14మంది సభ్యులు ఉంటారని,అలాగే షో వంద రోజులు జరగనుందని చెప్పేశారు. ఇప్పటికే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది ఎవరు అనేదానిపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. ఇలా పేర్లు పబ్లిసిటీ అయినవారిలో కొందరు ఖండిస్తే, కొందరు మాత్రం నేరుమెదపలేదు.

తాజాగా బిగ్ బాస్ 3కి ‘ఉయ్యాల-జంపాల’ సినిమాలో హీరోయిన్ అవికా గౌర్ స్నేహితురాలిగా తెలుగు తెరకు పరిచయమైన గాయత్రి గుప్తా ఎంపికైందని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఫిదా’లో కూడా గాయత్రి సాయి పల్లవి స్నేహితురాలిగా చేసింది. ఐతే షో నింబంధనల ప్రకారం మొదటి ఎపిసోడ్ వరకు ఇంటి సభ్యుల వివరాలు రహస్యం కావడంలో ఈసారి అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే ఆ 14మంది ఎవరు అనేది సస్పెన్సు.

సంబంధిత సమాచారం :

More