గీత గోవిందం దేవరకొండకు బాగానే ఉపయోగపడుతుంది !

గీత గోవిందం దేవరకొండకు బాగానే ఉపయోగపడుతుంది !

Published on Aug 16, 2018 8:35 PM IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో యూత్ లో క్రేజ్ ను తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ‘గీత గోవిందం’ నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. మొదటి రోజు ఈచిత్రం 10కోట్ల షేరును రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

ఇక ఈ చిత్రం ఈతరహా కలెక్షన్స్ ను సాధించడంతో విజయ్ నటిస్తున్న తదుపరి చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.

ఇక విజయ్ నటిస్తున్న’డియర్ కామ్రేడ్’ చిత్రానికి కూడా మరింత బడ్జెట్ ను పెట్టాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోందట. అర్జున్ రెడ్డి విజయ్ కెరిర్ ను మలుపు తిప్పితే గీత గోవిందం విజయ్ ను స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు