రామ్ చరణ్, అల్లు అర్జున్ మల్టీ స్టారర్ !

2nd, April 2017 - 06:12:19 PM


మెగా ఫ్యామిలీలోని ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లు త్వరలో ఒక మల్టీఈ స్టారర్ లో కలిసి నటించబోతున్నారట. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘ఎవడు’ చిత్రం బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ భారీ వ్యయంతో నిర్మించనున్నారని కూడా తెలుస్తోంది.

అలాగే ఈ చిత్రానికి ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారట. అయితే ఈ వార్తపై మెగా హీరోల నుండి గాని, అల్లు అరవింద్ నుండి గాని ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గతంలో బన్నీ, చరణ్ లు పలు సందర్భాల్లో సరైన స్క్రిప్ట్ దొరికితే కలిసి నటించడానికి సిద్ధమని చెప్పడాన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం సుకుమార్ సినిమా పనుల్లో, బన్నీ ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.