ముఖ్యమైన ఏరియాల్లో ‘ధృవ’ సినిమాను విడుదల చేయనున్న ‘గీతా ఆర్ట్స్’

allu-arvind
రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘గీతా ఆర్ట్స్ బ్యానర్’ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ‘ధృవ’. వరుస ఫ్లాపుల తరువాత చరణ్ చాలా జాగ్రత్తగా చేస్తున్న చిత్రం కావడం వల్ల మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పైగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తనీ ఒరువన్’ కు రీమేక్ చిత్రం కావడం వలన, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించడం వలన బయ్యర్స్ లోనూ చిత్రం ఖచ్చితంగా మంచి వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్ అయితే చిత్రం విజయంపై చాలా ధీమాగా ఉన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఏరియాలైన ‘నైజాం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరియు కృష్ణా’ జిల్లాల్లో స్వయంగా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. వ్యాపార విషయంలో ఆచి తూచి అడుగులు వేసే అరవింద్ ఈ సినిమాపై ఇంత నమ్మకంగా ఉండటంతో సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాదిస్తుందని సినీ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.