‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వరుస సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతుంది. దాంట్లో భాగంగా అల్లు అర్జున్ తో ఓక సినిమాని అలాగే మహేష్ బాబు తో మరో చిత్రాన్ని నిర్మించనుంది. ఇక తాజాగా యువ హీరో తో ఓక సినిమాకు కమిట్ అవుతుంది ఈ సంస్థ.
యువ హీరో నాగ శౌర్య తో ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్న చిత్రాన్ని నిర్మించనున్నాడు నిర్మాత అల్లు అరవింద్. ఈచిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఇటీవల వరుసగా ‘అమ్మమ్మగారిల్లు , కణం , @నర్తనశాల’ చిత్రాలతో హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకున్న శౌర్య ప్రస్తుతం ‘నారీ నారీ నడుమ మురారి’ అనే చిత్రం తో పాటు మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత శౌర్య ఈ కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.


