పరుశురాం దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్ల పైచిలుకు గ్రాస్ ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈసినిమా ఇప్పటికి కొన్నిథియేటర్లలో మంచి రన్ ను కనబరుస్తుంది.
ఇక ఈ చిత్రం ఓవర్శిస్ లో అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన తెలుగు సినిమాల జాబితాలో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు అక్కడ $2,454,233 డాలర్లను రాబట్టింది. ఇక ఈ జాబితాలో బాహుబలి 2, బాహుబలి, రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు, మహానటి’ చిత్రాలు ముందు వరుసలో చోటు సంపాదించాయి. ఫుల్ రన్లో గీత గోవిందం అక్కడ మహనటి కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది. గీతా ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.


