‘గీతోపదేశం’ ఆడియో విడుదల

‘గీతోపదేశం’ ఆడియో విడుదల

Published on Mar 15, 2015 1:19 AM IST

Geethopadesam
శ్రీ సాయి విశ్వక్ సేన పిక్చర్స్ పతాకంపై జిన్నా దర్శకుడిగా రూపొందిన చిత్రం.. గీతోపదేశం. అర్జున్ యజత్, వందిత, మధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను శనివారం హైద్రాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు రాజ్‌కిరణ్ ఆడియో సిడీని విడుదల చేశారు. ఈ ఆడియో శ్రేయాస్ మీడియా ద్వారా మార్కెట్‌లోకి విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ సినిమా విజయం పట్ల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో నందు, దర్శకుడు రాజ్‌కిరణ్, రచయిత బీవీఎస్ రవి లాంటి ప్రముఖులు పాలు పంచుకున్నారు. ఈ సినిమా రాహుల్, వెంగీలు సంగీతాన్ని సమకూర్చారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు