బాహుబలిని పొగడ్తలతో ముంచిన గెహ్న వసిస్థ్

బాహుబలిని పొగడ్తలతో ముంచిన గెహ్న వసిస్థ్

Published on Jul 12, 2015 12:30 PM IST

Gehana-Vasisth

టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తన హవా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న హాట్ బ్యూటీ గెహ్న వసిస్థ్. నమస్తే, బిటెక్ లవ్ స్టొరీ మరియు 33 ప్రేమ కథలు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. అంతే కాకుండా స్వతహాగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేస్తోంది. ఇది పక్కన పెడితే ఇండియన్ సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూసిన బాహుబలి కోసం తను కూడా ఎంతగానో ఎదురు చూసిందని, ఆ సినిమా తనకి పిచ్చ పిచ్చగా నచ్చేసిందని ఈ భామ చెబుతోంది.

‘బాహుబలి సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ వెయిట్ చెయ్యలేక ప్రీమియర్ షో చూసాను. సూపర్బ్ స్క్రీన్ ప్లే & డైరెక్షన్.. హ్యాట్సాఫ్ టు రాజమౌళి గారు. నేను స్వతహాగా ప్రభాస్ అభిమానిని, తను చేసే ప్రతి సినిమా చూస్తాను. బాహుబలి సినిమాలో అమేజింగ్ పెర్ఫార్మన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసాడు. నా పక్కన కూర్చున్న ఓ ఫారినర్ రాజమౌళిని చూసి హాలీవుడ్ చాలా నేర్చుకోవాలి అని చెప్పడం ఇండియన్ గా నాకు గర్వంగా అనిపించిందని’ గెహ్న వసిస్థ్ తెలిపింది. ఇలాంటి ఎంతోమంది స్టార్స్ మరియు అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఎంతోమంది స్టార్స్ కూడా బాహుబలిని తమ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క లీడ్ రోల్స్ లో కనిపించారు.

తాజా వార్తలు