గెట్ రెడీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆ అనౌన్స్మెంట్ వచ్చేస్తుందా!?

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా సాలిడ్ అప్డేట్ అతి త్వరలోనే రానుంది అని వినిపిస్తుంది.

మెయిన్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడు క్లారిటీ రానుందట. మారిన సమీకరణాలతో ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం రిలీజ్ కి ముందే వస్తుంది అని దాదాపు ఖరారు అయ్యింది. బహుశా మార్చ్ 26 లేదా 27నే సినిమా ఉండొచ్చని వినిపిస్తుండగా దీనిపై అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి ఇప్పుడు రానున్నట్టు బజ్ వినిపిస్తుంది. మరి ఇదెప్పుడు అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version