గెట్ రెడీ..”RRR” నుంచి ఫైరీ చరణ్ పోస్టర్ ఫీస్ట్ ఈరోజే.!

Published on Mar 26, 2021 9:02 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వస్తున్న సందర్భంగా తాను నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. దీనితో ఆ పోస్టర్ లో చరణ్ ఎలా ఉంటాడు? ఎప్పుడు ఏ టైం కి విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి దీనిపై RRR మేకర్స్ ఊహించని విధంగా ఈరోజే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకే అల్లూరిగా చరణ్ పై ఫైరీ అండ్ పవర్ ఫుల్ పోస్టర్ ను ఈ మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం గంటలకు విడుదల చెయ్యనున్నట్టుగా ప్రకటించారు. సో ఈ మోస్ట్ అవైటెడ్ పోస్టర్ కోసం అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.

మరి ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొమరం భీం రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆలియా, అజయ్ దేవగన్ లాంటి అగ్ర బాలీవుడ్ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :