
గత 20 ఏళ్ళుగా తెలుగు ప్రజలను ప్రతి రోజూ ఎంటర్టైన్ చేస్తున్న టీవీ ఛానల్ ఈ టీవీ. రామోజీ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత రామోజీ రావు స్థాపించిన ఈ టీవీ ఛానల్ గత 20 ఏళ్ళుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఆ తర్వాత ఈ టీవీ నుంచి న్యూస్ కోసం స్పెషల్ గా ఈ టీవీ తెలంగాణ న్యూస్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యూస్ అనే రెండు ఛానల్స్ వచ్చాయి. ఈ రెండు చానల్స్ కూడా మంచి పేరు సంపాదించుకున్నాయి. ఈ మూడు ఛానల్స్ తర్వాత రామోజీ రావు మరో నాలుగు సరికొత్త టీవీ ఛానల్స్ ని లాంచ్ చేయడానికి అన్నీ సిద్దం చేసుకుంటున్నారు.
ఈ నాలుగు ఛానల్స్ ని నవంబర్ 14వ తేదీన రామోజీ రావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. ఈ నాలుగు ఛానల్స్ ని ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో డిజైన్ చేసారు. ఇప్పటి వరకూ తెలుగులో ఏ ఒక్క ఛానల్ బ్రాండ్ కి కూడా ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లేకపోవడంతో ఆ ఘనతని సాధించిన ఏకైక చానల్ ఈటీవీ కావడం చెప్పుకోదగిన రికార్డ్ పాయింట్. నవంబర్ 14న లాంచ్ చేయనున్న నాలుగు ఛానల్స్ పేర్లు, ఆ ఛానల్స్ స్పెషాలిటీ ఏంటి అనే వివరాల లోకి వెళితే..
1. ఈ టీవీ ప్లస్ (Etv Plus) – అవుట్ అండ్ అవుట్ కామెడీ ఛానల్ గా రానున్న దీని లక్ష్యం 24 గంటలు బుల్లితెర ప్రేక్షకులను నవ్వించడమే..
2. ఈ టీవీ లైఫ్ (Etv Life) – ఈ చానల్ లో 24 గంటలు ఆరోగ్యానికి సంబందించిన స్పెషల్ ప్రోగ్రామ్స్ మరియు లైఫ్ స్టైల్ కి సంబందించిన ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతాయి.
3. ఈ టీవీ అభిరుచి (Etv Abhiruchi) – ఈ టీవీ అభిరుచిని స్పెషల్ కుకింగ్ ఛానల్ గా డిజైన్ చేసారు. ఈ ఛానల్ లో మన ఇండియాతో పాటు వరల్డ్ లోని అన్ని దేశాల ఫేమస్ వంటకాలకు సంబందించిన ప్రోగ్రామ్స్ ని ప్రసారం చేయనున్నారు.
4. ఈ టీవీ సినిమా (Etv Cinema) – రోజులోని 24 గంటల పాటు మిమ్మల్ని డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో ఎంటర్టైన్ చెయ్యడమే ఈ ఈటీవీ సినిమా ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం.
రామోజీరావు లాంచ్ చేయనున్న ఈ నాలుగు ఛానల్స్ పూర్తి వివరాల కోసం మరియు ఈటీవీ ప్లస్ తో ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసారు అనే విషయాల కోసం మా 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

