గెట్ రెడీ..పవన్ నుంచి మాస్ ట్రీట్ సిద్ధంగా ఉందట.!

Published on Jul 27, 2021 1:20 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఒకటి. మళయాళ సూపర్ హిట్ “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ డ్రామా షూట్ మళ్ళీ నిన్నటి నుంచే రీస్టార్ట్ కాగా మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు.. అంతే కాకుండా పవన్ చేస్తున్న పోలీస్ రోల్ కి భీమ్లా నాయక్ అనే పేరు కూడా రివీల్ చెయ్యగా ఒక్కసారిగా మాస్ వైబ్స్ మొదలయ్యాయి.

మరి దాని తర్వాత ఒక అదిరే మేకింగ్ వీడియోని కూడా మేకర్స్ వదులుతారని తెలియగా ఇప్పుడు దానికి కూడా టైం ఫిక్స్ అయ్యిపోయింది. ఆ సాలిడ్ మేకింగ్ అండ్ సర్ప్రైజింగ్ వీడియోని ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. పైగా మళ్ళీ పవన్ భీమ్లా పోలీస్ గెటప్ లోని పేరునే చూపిస్తూ మరింత ఆసక్తి రేపారు.

మరి ఈ మేకింగ్ వీడియో ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :