గెట్ రెడీ..అవైటెడ్ మహేష్ సినిమా అప్డేట్ కి టైం ఫిక్స్!

Published on May 1, 2021 1:09 pm IST

సూపర్ స్టార్ మహేష్ వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నా వాటి తర్వాత దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే పక్కా మాస్ ఎంటెర్టైనర్ ను ప్లాన్ చేసినా వాటిని మించిన కిక్ త్రివిక్రమ్ తో అనౌన్స్ కానున్న ప్రాజెక్ట్ అప్డేట్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కు ఇప్పుడు వస్తుంది. ఈరోజు ఉదయం నుంచే ఆ ప్రకంపనలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యిపోయాయి.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈ కాంబోపై రచ్చ లేపుస్తున్నారు. ఇక ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ కాంబోపై అధికారిక అప్డేట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగ వంశీ కన్ఫర్మ్ చేసేసారు. సో ఇక మహేష్ ఫ్యాన్స్ మరియు త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబోపై అంచనాలు ఉన్న ప్రతీ ఒక్కరూ ఆ టైం ని లాక్ చేసుకోవచ్చు. ఇక అంతా ఆ టైం కు జరిగే బ్లాస్ట్ కోసం ఎదురు చూడండి మరి.

సంబంధిత సమాచారం :