వివిఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎవరు రానున్నారంటే !

Published on Dec 25, 2018 8:47 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 27న యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుందని తెలిసిందే. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. ఇక ప్రస్తుతం ఈచిత్రంలో స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు భారీ సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొంటున్నారట. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈనెల 26తో పూర్తి కానుంది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 11న విడుదలకు సిద్దమవుతుంది. ఇక సంక్రాంతి చరణ్ కు బాగా కలిసివచ్చింది. ఆయన నటించిన ‘నాయక్ , ఎవడు’ చిత్రాలు పండుగ సీజన్లో విడుదలై మంచి విజయాలను సాధించాయి. మరి ఈ చిత్రం తో కూడా హిట్ కొట్టి ఆ సెంటిమెంట్ ను చరణ్ కొనసాగిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :