ఆకట్టుకుంటున్న “గని ఆంథెం” ప్రోమో

ఆకట్టుకుంటున్న “గని ఆంథెం” ప్రోమో

Published on Oct 26, 2021 8:08 PM IST


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం ను డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో రెనైశ్శన్స్ మరియు అల్లు బాబీ కంపనీ పతకాల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి గని ఆంతెమ్ పాటను అక్టోబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. నేడు అందుకు సంబంధించిన ఒక ప్రోమో ను విడుదల చేసింది. ఈ ప్రోమో అటు క్లాస్ ఆడియెన్స్ ను ఇటు మాస్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు