గని నుండి ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Oct 22, 2021 4:00 pm IST

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను రెనాసైన్స్ మరియు అల్లు బాబీ కంపనీ పతకాల పై సిధు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు, సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ రావడం జరిగింది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ నెల 26 వ తేదీన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గని అంతేం పాట ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలపడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో వరుణ్ లుక్ సూపర్ గా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :