అమ్మాయిలకు రామ్ ను కలుసుకొనే అవకాశం !

Published on Feb 13, 2019 12:21 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక వాలెంటైన్స్ డే సందర్బంగా చిత్ర యూనిట్ ఒక ఆసక్తికరమైన కాంటెస్ట్ తో ముందుకొచ్చింది. విషయానికి వస్తే
ఈ కాంటెస్ట్ కోసం అమ్మాయిలు చేయాల్సిందల్లా హైదరాబాదీ స్టైల్ లో రామ్ కు ప్రపోజ్ చేస్తూ ట్విట్టర్ లో రామ్ ను ట్యాగ్ చేసి ఇస్మార్ట్ గర్ల్ అని ట్వీట్ చేయడమే. అందులో నుండి 5 గురి బెస్ట్ ప్రపోజల్ ను ఎంపిక చేసి వారికీ ఇస్మార్ట్ శంకర్ సినిమా సెట్స్ లో రామ్ ను కలిసే అవకాశం కలిపిస్తున్నారు. మరి ఆ 5 గురు లక్కీ గర్ల్స్ ఎవరైతారో చూడాలి.

ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన నాబా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :