‘గాడ్ ఆఫ్ వార్’ అప్‌ డేట్ కి టైమ్ లాక్ !

‘గాడ్ ఆఫ్ వార్’ అప్‌ డేట్ కి టైమ్ లాక్ !

Published on Jun 29, 2026 11:00 AM IST

ఎన్టీఆర్ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఈ రోజే ఉంటుందని నిర్మాత నాగ వంశీ ఇప్పటికే ధృవీకరించారు. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అప్ డేట్, ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు రాబోతుంది. ఎన్టీఆర్ నుంచి రానున్న అప్ డేట్ కి టైమ్ లాక్ అయ్యాక, అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.

ఇంతకీ, ఎనౌన్స్ మెంట్ పోస్టర్ వదులుతారా ?, లేక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తారా ?, కేవలం సినిమాని ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారా ?, లేక మరో సర్‌ప్రైజ్ ఉంటుందా ? అనేది చూడాలి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.

తాజా వార్తలు