నైజాంలో “గాడ్ ఫాథర్” రెండో రోజు వసూళ్లు డీటెయిల్స్ ఇవే..!

Published on Oct 7, 2022 11:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక సాలిడ్ గెస్ట్ రోల్ లో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన లేటెస్ట్ హిట్ చిత్రం “గాడ్ ఫాథర్”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం రెండు రోజుల్లో అయితే భారీ వసూళ్లే అందుకుంది. మొదటి రోజుకి రెండో రోజుకి చాలా తక్కువ డ్రాప్ తోనే ఈ చిత్రం మంచి నంబర్స్ నమోదు చెయ్యగా ఒకో ఏరియా కి సంబంధించి అయితే వసూళ్లు ఇప్పుడు తెలుస్తున్నాయి.

నైజాం లో మొదటి రోజు ఈ చిత్రం 3 కోట్ల మేర షేర్ రాబట్టగా రెండో రోజు ఈ చిత్రం 2.6 కోట్లు షేర్ అందుకుంది. దీనితో ఈ చిత్రం రెండు రోజుల్లో 5.6 కోట్లు వసూలు చేసింది. దీనితో ఈ వారాంతానికి ఈ చిత్రం మరింత బెటర్ వసూళ్లు నమోదు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ అయితే సాలిడ్ మ్యూజిక్ అందించగా సూపర్ గుడ్ ఫిలింస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :