పవన్‌తో పనిచేయాలనుకునే దర్శకులకు ఇది గోల్డెన్ ఛాన్స్

Published on Jan 30, 2020 3:00 am IST

పవన్‌తో సినిమా చేయాలనేది చాలామంది దర్శకులు, నిర్మాతల కోరిక. అయితే పవన్ పూర్తిస్థాయిల్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఏడాదికి కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసేవారు. దీంతో ఆయన కోసం కథలు రాసుకున్న చాలామంది దర్శకులకు డేట్స్ దొరక్క వారి ఆశ కేవలం ఆశగానే మిగిలిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పవన్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అది కూడా వీలైంత త్వరగా ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో.

ఇప్పటికే వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఒక చిత్రం చేస్తున్న ఆయన ఈరోజు క్రిష్ సారథ్యంలో కొత్త చిత్రం స్టార్ట్ చేశారు. ఈ రెండూ 2020లోనే విడుదలకానున్నాయి. ఇకపై కూడా పవన్ వేగంగానే సినిమాలు చేయాలని అనుకుంటున్నారట. అందుకే తనవద్దకు వచ్చిన కథలన్నింటినీ వింటున్నారట. మంచి కథ దొరికితే వెంటనే లాక్ చేసి డేట్స్ ఇచ్చేయాలని, కానీ వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తిచేయగలిగిన వారికే అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నారట. కాబట్టి పవన్‌తో వర్క్ చేయాలనుకునేవారు ఎవరైనా సరే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 2021 లేదా 2022కి అయినా ఆయన డేట్స్ సంపాదించుకునే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :