అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న  “గోల్డ్ మెడల్ “

Published on Jun 25, 2021 8:00 am IST

యు. కె. క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్,దేవిశ్రీ, రుక్మిణి, నటీనటులుగా  ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం “గోల్డ్ మెడల్ ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమౌతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ ముంత మాట్లాడుతూ ..ఈ కథ లోని పాత్రలు బంగారంతో  యే విదంగా ముడిపడి ఉన్నాయనే కథాంశంతో నిర్మించిన చిత్రమే “గోల్డ్ మెడల్ .నిర్మాతకు నేను కథ చెప్పిన వెంటనే  నాపై నమ్మకంతో ఈ చిత్రానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పడం జరిగింది.నేను ఏ లొకేషన్ కావాలన్నా ఖర్చుకు వెనుకడకుండా నిర్మించినందుకు ఆయనకు నా ధన్యవాదాలు. నటీనటులు అందరూ కూడా బాగా సహకరించారు. చిత్రం చాలా బాగా వచ్చింది.

నిర్మాత నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకం ఉంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. నిర్మాత నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మన జీవితంలో బంగారంతో విడదీయరాని బంధం ఉంది, ఒకరికి నగల మోజు, ఇంకొకరికి వ్యాపారం, మరొకరికి  మొక్కుబడి, ప్రతి ఒక్కరికీ బంగారం సెంటిమెంట్ ఈ సినిమాలో కథా నాయకుడు జీవితాన్ని బంగారం ఏ విధమైన మలుపులు తిప్పింది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు నాకు ఏవిదమైన కథ చెప్పాడో అలాగే తీశాడు.నటీనటులు అందరూ చక్కగా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాము.  ఒక కొత్త ప్రయత్నం తో మేము  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని అన్నారు

సంబంధిత సమాచారం :