OTT : ఈటీవీ విన్‌లో ‘గొల్ల రామవ్వ’.. జనవరి 25 నుంచి స్ట్రీమింగ్

OTT : ఈటీవీ విన్‌లో ‘గొల్ల రామవ్వ’.. జనవరి 25 నుంచి స్ట్రీమింగ్

Published on Jan 22, 2026 11:17 PM IST

Golla-Ramavva

మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రచించిన తెలంగాణ సాయుధ పోరాట గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గొల్ల రామవ్వ’. సీనియర్ నటి తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం జనవరి 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ కానుంది. సుచేత డ్రీమ్ వర్క్స్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ ఈ చిత్రాన్ని నిర్మించగా, ముళ్ళపూడి వరా దర్శకత్వం వహించారు.

తాజాగా జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పి.వి. నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కుమారుడు పి.వి. ప్రభాకరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తమ తండ్రిగారు రాసిన గొప్ప కథల్లో ఒకటైన ‘గొల్ల రామవ్వ’ను అద్భుతంగా దృశ్యరూపంలోకి తెచ్చారని వాణీదేవి ప్రశంసించారు. గతంలో ఈటీవీ విన్ కోసం ‘మౌనమే నీ భాష’ చిత్రాన్ని అందించిన ఈ బృందం, ఈ సినిమాతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేస్తుందని అతిథులు పేర్కొన్నారు.

ఈ చిత్రానికి అజహర్ షేక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ సాహిత్యాన్ని కూడా అందించారు. సాయి మధుకర్ సంగీతం సమకూర్చగా, గంగమోని శేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. రాజీవ్ కనకాల, కాసర్ల శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు