సిటీల్లో ‘గాన్ గర్ల్’ కి సూపర్బ్ రెస్పాన్స్

సిటీల్లో ‘గాన్ గర్ల్’ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Nov 2, 2014 11:41 AM IST

gone-girl-poster

హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ‘గాన్ గర్ల్’ సినిమా ఎట్టకేలకు ఇండియాలో సెన్సార్ ఇబ్బందులను క్లియర్ చేసుకొని గత శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ హైదరబాద్ లో కూడా రిలీజ్ అయ్యింది కానీ లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమా సోషల్ నెట్వర్క్స్ మరియు విమర్శకుల నుంచి మంచి మన్ననలు రావడంతో ఈ సినిమాకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

దాంతో వీకెండ్ లో ప్రతి ఒక్కరూ మల్టీ ప్లేక్స్ లో ఈ సినిమా చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో వీకెండ్ టికెట్స్ అన్ని అమ్ముడు పోయాయి. దీంతో ఈ చిత్ర ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా స్క్రీన్స్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఒక్క హైదరబాద్లోనే కాకుండా మేజర్ సిటీలలో కూడా ఈ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ మిస్ అయిపోయిందనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ మిస్టరీ ప్రతి ఒక్కరినీ కట్టిపడేసేలా ఉందని చూసిన వారు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు