గుడ్ లక్ సఖి విడుదల తేదీ లో మార్పు!

Published on Dec 5, 2021 8:03 pm IST


కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్రం ను వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు ఇప్పటికే ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీకి సంబందించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన డిసెంబర్ 10 వ తేదీన సినిమాను విడుదల చేయలేక పోతున్నట్లు తెలిపింది. అంతేకాక ఈ చిత్రాన్ని డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సోషల్ మీడియా వేదిక గా వెల్లడించడం జరిగింది. అందరి మద్దతు కావాలి అంటూ తెలిపారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :