బన్నీ ఫాన్స్ కి శుభవార్త – రేపే ఫస్ట్ లుక్

Published on Aug 31, 2019 11:13 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం అలా వైకుంఠపురంలో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా పూజ హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. కాగా చాలా గ్యాప్ తరువాత అల్లు అర్జున్ మరియు త్రివిక్రంల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఇప్పటికే ఈ చిత్రం మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి… కాగా ఇప్పటికే విడుదలైన ఒక చిన్న టీజర్ విశేషమైన ఆధారణని దక్కించుకుందని చెప్పాలి.

అయితే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్లుక్ను ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక రకంగా అల్లు అర్జున్ అభిమానులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. కాగా గతంలో అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ల కలయికలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ మూడవ చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి…

సంబంధిత సమాచారం :