త్వరలో కమల్ – శంకర్ ల సినిమా మొదలు కానుంది !

Kamal Shankar
1996 లో శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద విజయం సాధించో తెలిసిందే. ఇక ఇప్పుడు చాలా కాలం తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. శంకర్- కమల్ కలయికలో రానున్న ‘భారతీయుడు 2’ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం యొక్క వివరాలను త్వరలొనే ప్రకటించనున్నారు.

ప్రస్తుతం శంకర్ 2. 0 చిత్ర పనుల్లో బిజీ గా ఉండగా కమల్ హాసన్ విశ్వరూపం 2 ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఈ నెల 10 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version