మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ !

Published on Mar 8, 2019 1:00 am IST

మహేశ్ బాబు అభిమానులు ‘మహర్షి’ సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, అలాగే ముఖ్యంగా మహర్షి ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మార్చి 21వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నారు. కాగా మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More