
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి రెండు వరుస సూపర్‌హిట్ల తర్వాత నిఖిల్ హీరోగా నటించిన సినిమా.. ‘సూర్య vs సూర్య’. గురువారం రోజున విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌నే సాధించి పెట్టింది. నిఖిల్‌కు హ్యాట్రిక్ సినిమా అంటూ ప్రచారం పొందడం, నిఖిల్ గత రెండు సినిమాల ట్రాక్ రికార్డ్, ట్రైలర్, కథాంశం కొత్తగా ఉండడం ఈ సినిమా ఓపెనింగ్స్‌కి కలిసొచ్చింది. సినిమా విడుదలైన రోజు సెలవురోజు కాకున్నా, మంచి ఓపెన్ంగ్స్‌నే రాబట్టింది. ఇక నిన్న హోళీ రోజు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి.
ఒక సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు విమర్శకులు పూర్తి స్థాయిలో మార్కులు వేయకున్నా, చక్కటి ప్రేమకథ, అందమైన విజువల్స్ ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు. నేడు, రేపు ఈ కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాతే సినిమా అసలు రేంజ్ ఏమిటనేది బయటపడుతుంది. మరి.. లాంగ్ రన్‌లో కూడా ఇలాగే నిలబడి.. నిఖిల్‌కు మూడో హిట్‌ను తెచ్చిపెడుతుందా అనేది తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే!

