
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ లాంటి వరుస లవ్ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నాగ శౌర్య నుంచి వస్తున్న మరో రొమాంటిక్ లవ్ స్టొరీ ‘అబ్బాయితో అమ్మాయి’. రమేష్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న’అబ్బాయితో అమ్మాయి’ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా రిలీజ్ చేసుకుంది. ఇటీవలే ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఆడియోని కూడా రిలీజ్ చేసారు. ఈ మూవీ ఫస్ట్ టీజర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నాం అని అనౌన్స్ చేసారు. తాజాగా మరోసారి ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. క్రిస్మస్ కానుకగా దిసేమబ్ర్ 24న అబ్బాయితో అమ్మాయి రిలీజ్ కానుంది. రెండు వారాల క్రితమే అబ్బాయితో అమ్మాయి బిజినెస్ మొత్తం పూర్తయ్యిందని, పక్కాగా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తామని రమేష్ వర్మ మరోసారి తెలిపాడు. నాగ శౌర్య సరసన బాలీవుడ్ భామ పాలక్ లల్వాని హీరోయిన్ గా నటించనుంది. జెజె సినిమాస్ పతాకంపై జక్కం వందనా అలేఖ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

