47 డేస్ లోని క్యా కారోన్ పాటకు మంచి స్పందన !

47 డేస్ లోని క్యా కారోన్ పాటకు మంచి స్పందన !

Published on Feb 15, 2018 8:50 PM IST

టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమా ‘’47 డేస్’’.. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ట్యాగ్ లైన్. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా ప్రదీప్ మద్దాలిన దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం.

హరితేజ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్ష్పిరియన్స్ ఎవ్వబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని క్యా కరోన్ పాటను పూరి జగన్నాధ్ విడుదల చెయ్యడం జరిగింది. సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసమయంలోనే పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల ఈ పాటను రచించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు