అజ్ఞాతవాసి టిజర్ కు రెస్పోన్స్ అదిరిపోయింది !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా అజ్ఞాతవాసి. పవన్ నటించిన 25 సినిమా ఇదే అవ్వడంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇటివల విడుదలైన ఈ సినిమా రెండు పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన టిజర్ కు మంచి రేస్పోన్స్ లభిస్తోంది, క్లాసిక్ డాన్స్ మూమెంట్స్, పవన్ యాక్షన్ సీక్వెన్స్ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

డిసెంబర్ 19 న ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా జరపబోతున్నారు. ఆరోజే ట్రైలర్ విడుదలైయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని సమాచారం. కుష్బు, మురళి శర్మ, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అజ్ఞాతవాసి టీజర్ కోసం క్లిక్ చేయండి